షారుఖ్‌ను ఘాటు ముద్దుతో ఊపిరాడకుండా చేసిన దీపిక.. రణ్‌వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
షారుఖ్‌ను ఘాటు ముద్దుతో ఊపిరాడకుండా చేసిన దీపిక.. రణ్‌వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే కలిసి నటించిన చిత్రం ‘జవాన్’. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదలై మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనిని డైరెక్టర్ అట్లీ తెరకెక్కించగా.. ప్రియమణి, విజయ్ సేతుపతి, నయనతార కీలక పాత్రల్లో నటించారు. జవాన్ మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర యూనిట్ సెలబ్రేషన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రీసెంట్ గా జవాన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మూవీ టీం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి షారుక్ , అట్లీ , విలన్ పాత్రలో నటించిన విజయ్ సేతుపతి తో పాటు దీపికా పదుకొనే కూడా హాజరైంది.

కాగా ఈ క్రమంలోనే ఆమె షారుఖ్‌ని పట్టుకుని ఘాటుగా ముద్దు పెట్టుకున్న ఫొటోను దీపిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దానికి దీపిక భర్త రణ్‌వీర్ సింగ్ స్పందించాడు. ‘‘నా హృదయం ప్రేమతో నిండిపోయింది’’ అంటూ కామెంట్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు భార్య వేరే మగాడికి ముద్దు పెడితే రణ్‌వీర్ అలా స్పందించాడేంటని షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే ఫోటో వైరల్ గా మారింది.


Next Story

Most Viewed