సౌత్ హీరో‌తో నటించడానికి భారీగా డిమాండ్ చేస్తున్న దీపిక..?

by Disha Web Desk 13 |
సౌత్ హీరో‌తో నటించడానికి భారీగా డిమాండ్ చేస్తున్న దీపిక..?
X

దిశ, సినిమా: శింబు హీరోగా పాన్ ఇండియా రేంజ్‌లో దేసింగ్ పెరియసామి దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. కమల్‌హాసన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కథనాయికగా దీపికా పదుకునే నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో నటించేందుకు ఆమె భారీగా పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు రూ.30 కోట్ల కావాలని నిర్మాతలకు షాక్ ఇచ్చిందట. అంతేకాదు షూటింగ్‌కు హాజరైన టైమ్‌లో తనతో పాటు, తన స్టాఫ్‌కు కూడా ఫైవ్ స్టార్ హోటల్‌లో బస ఏర్పాటు చేయాల్సిందిగా కోరిందట.

దీంతో దీపిక డిమాండ్లకు షాక్ అయిన మేకర్స్, దీపికకు పెట్టె ఖర్చులో మూడవ వంతు ఇచ్చిన మరో బాలీవుడ్ హీరోయిన్ ఒప్పుకుంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతం నెట్టింట ఈ విషయం చర్చనీయాంశమవగా.. బాలీవుడ్ హీరోలతో చేసే సినిమా‌లతో పోల్చితే దీపిక సౌత్ చిత్రాలకు రెట్టింపు పారితోషికం అడగడం కరెక్ట్ కాదని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

Also Read..

ఇంట్లో డోర్ వేసుకొని ఆ వీడియోస్ చూస్తున్న Mrunal Thakur !

Next Story

Most Viewed