- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా(Shivaji Raja) ఇంట్లో విషాదం నెలకొంది.

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా(Shivaji Raja) ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి జి. రామరాజు (Rama Raju)(85) గారు మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో మధురానగర్‌లోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా వయసు రీత్యా వచ్చే సమస్యలతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రితో ఎంతో అనుబంధం ఉన్న శివాజీ రాజా, ఆయన మరణంతో తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. రామరాజు గారి భౌతికకాయాన్ని అందరి సందర్శన కోసం ప్రస్తుతం వారి నివాసంలోనే ఉంచారు. ఇక అంత్యక్రియల విషయానికొస్తే.. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించబోతున్నారు. శివాజీ రాజా తండ్రి మరణవార్త విన్న సినీ ఇండస్ట్రీ పెద్దలు, తోటి నటులు మరియు రాజకీయ ప్రముఖులు ఆయనకు ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించే పనుల్లో శివాజీ రాజా ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు.






