'వారసుడు' ఒక పండుగలా అనిపిస్తుంది: హీరో శ్రీకాంత్

by Disha Web Desk 17 |
వారసుడు ఒక పండుగలా అనిపిస్తుంది: హీరో శ్రీకాంత్
X

దిశ, సినిమా: దళపతి విజయ్, రష్మిక ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం 'వారసుడు'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై దిల్ రాజు, శిరీష్, పరమ్, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించిన మూవీ జనవరి 12న రిలీజ్‌కానుంది. ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ హీరో శ్రీకాంత్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నా కెరీర్‌లో తమిళ్ సినిమా చేయడం ఇదే తొలిసారి. ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌‌లో అద్భుతమైన హ్యుమన్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ చిత్రం ఒక దృశ్యకావ్యంలా ఉంటుంది. విజయ్‌కి అన్నగా నటిస్తూ తమిళంలో అడుగుపెట్టినందుకు ఆనందంగావుంది. విజయ్ అంకితభావంతో పనిచేస్తాడు' అని చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్లు మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యానన్న శ్రీకాంత్.. ఈ సంక్రాంతికి విడుదలయ్యే అన్ని సినిమాలు బాగా ఆడాలంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు.



Next Story

Most Viewed