‘హాయ్ నాన్న’ నుంచి క్యూట్ వీడియో రిలీజ్.. పాప మాటలకు ఫ్యాన్స్ ఫిదా

by Disha Web Desk 10 |
‘హాయ్ నాన్న’ నుంచి క్యూట్ వీడియో రిలీజ్.. పాప మాటలకు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: స్టార్ హీరో నాని నటిస్తున్న తాజా మూవీ ‘హాయ్ నాన్న’ నుంచి మరో సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. రెండు రోజుల క్రితమే సముద్ర అలల దగ్గర పాప చేతులు పట్టుకుని ప్రేమగా మాట్లాడుతున్న నాని పిక్ షేర్ చేసి మూవీపై క్యూరియాసిటీ పెంచేయగా తాజాగా తండ్రి కూతుళ్ల ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. కిచెన్‌లో పాపను పక్కను కూర్చోబెట్టుకుని చపాతి పిండి పిసుకుతూ ఓ లవ్ సాంగ్ పాడుతుంటాడు నాని. ఇంతలోనే నాన్నా.. ఇది లవ్ స్టోరీనా అని పాప ప్రశ్నిస్తుంది. వెంటనే హాయ్ నాన్న నా.. ఆఫ్ కోర్స్ లవ్ స్టోరీనే అని చెబుతాడు హీరో. దీంతో మన స్టోరీ కాదా! అని ఆశ్చర్యపోయిన ఆమెకు మనస్టోరీ కూడా అని చెబుతాడు. అయితే లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్.. మరి మన సాంగ్ ఎప్పుడని అడగగానే.. చిరునవ్వుతో మన సాంగ్ ‘గాజు బొమ్మ’ రెడీనా అని నాని చెప్పడం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ గాజు బొమ్మ సాంగ్ ప్రమోషన్‌లో భాగంగా వీడియో రిలీజ్ చేయగా పూర్తి సాంగ్ అక్టోబరు 6న రాబోతున్నట్లు చివర్లో అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో వైరల్ అవుతోంది.

Read More: ‘#Thalaivar 170’లో భల్లాలదేవుడు.. ఇక ఫ్యాన్స్‌కు గూస్ బంప్సే



Next Story

Most Viewed