- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ పూర్తి చేసుకుని ‘A’ సర్టిఫికెట్ పొందిన కపుల్ ఫ్రెండ్లీ..
యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానస వారణాసి (Manasa Varanasi)జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’.

దిశ, సినిమా: యంగ్ హీరో సంతోష్ శోభన్(Santosh Shobhan), మానస వారణాసి (Manasa Varanasi)జంటగా నటిస్తున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే, తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోగా.. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ జారీ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా యూత్ ఫుల్ లవ్ స్టోరీలకు క్లీన్ సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తారు, కానీ ఈ సినిమాకు ‘A’ రావడం వెనుక ఆసక్తికర కారణం ఉందని మేకర్స్ వెల్లడించారు.
సినిమాకు ‘A’ సర్టిఫికెట్ రావడంపై నిర్మాత ధీరజ్ మొగిలినేని స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. తమ సినిమాలో ఎలాంటి అసభ్యకరమైన సీన్లు గానీ, బూతు కంటెంట్ గానీ లేదని ఆయన స్పష్టం చేశారు. కేవలం ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే టైటిల్ వినడానికి కాస్త అసభ్యంగా అనిపిస్తోందని, పేరు మార్చుకోవాలని సెన్సార్ బోర్డ్ సూచించిందని తెలిపారు. ఒకవేళ టైటిల్ మార్చకపోతే ‘A’ సర్టిఫికెట్ ఇస్తామని బోర్డ్ చెప్పడంతో, తాము టైటిల్‌కే మొగ్గు చూపామని ఆయన వివరించారు. ఇప్పటికే ఈ పేరు ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్ళిపోయినందున, టైటిల్ మార్చడం ఇష్టం లేక ‘A’ సర్టిఫికెట్‌కే ఒప్పుకున్నామని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, కేవలం సర్టిఫికెట్‌ను చూసి సినిమాను తప్పుగా అర్థం చేసుకోవద్దని నిర్మాత ప్రేక్షకులను కోరారు. ఇది ఒక స్వచ్ఛమైన ప్రేమకథ అని, ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. "చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ చూడదగ్గ సినిమా ఇది, కానీ టైటిల్ విషయంలో తగ్గేది లేదన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ధీరజ్ చెప్పిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వాలెంటైన్స్ డే నాడు ఈ 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి.






