డిసెంబర్ 22న తెలుగులో విడుదలవుతున్న 'కనెక్ట్'

by Disha Web Desk 6 |
డిసెంబర్ 22న తెలుగులో విడుదలవుతున్న కనెక్ట్
X

దిశ, సినిమా: లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కనెక్ట్'. అశ్విన్ శరవణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రౌడీ పిక్చర్స్‌ బ్యానర్‌పై నయన్ భర్త విగ్నేష్ నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే.. ఈ మూవీ తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు చెప్పిన యూవీ క్రియేషన్స్ సంస్థ.. ట్విట్టర్ వేదికగా తెలుగు టీజర్‌ను షేర్ చేసింది. డిసెంబర్ 22న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రానికి ఇంటర్వెల్ లేకపోవడం విశేషం. కాగా ప్రేక్షకుల్లో మూవీపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Also Read: విజయ్ దేవరకొండతో కృతి శెట్టి రొమాన్స్?

Next Story

Most Viewed