మెగా హీరోతో కలర్స్ స్వాతి ముద్దులాట.. కాలేజ్ డేస్ నుంచే బాండింగ్.. బయటపడ్డ సీక్రెట్స్!

by Disha Web Desk 9 |
మెగా హీరోతో కలర్స్ స్వాతి ముద్దులాట.. కాలేజ్ డేస్ నుంచే బాండింగ్.. బయటపడ్డ సీక్రెట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో సాయిధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ‘సోల్ ఆఫ్ సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సైనికుల భార్యల త్యాగాలను, వారి మనో వేదనను తెలియజేసేలా నవీన్ విజయ్ కృష్ణ ఈ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. ఈ ఏడాది ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 15) సందర్భంగా ‘సత్య’ అనే పేరుతో హృదయాలను హత్తుకునే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ అత్యంత భావోద్వేగ భరితంగా.. సైనికుల భార్యల మనో వేదనకు అద్దం పట్టేలా ఉండటంతో ఈ పాట ప్రేక్షకులందరినీ కంటతడి పెట్టించింది. ఇందులో తేజ్ ఒక సైనికుడిగా కనిపిస్తాడు. స్వాతి సాయిధరమ్ తేజ్ భార్యగా నటిస్తుంది.

ఇదంతా పక్కన పెడితే ‘మంత్ ఆఫ్ మధు’ అనే చిత్రంలో స్వాతి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ వేడుకను మంగళవారం(సెప్టెంబరు 26) నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా వచ్చిన సాయిధరమ్ తేజ్ స్వాతి గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. ‘‘స్వాతి మీ అందరికీ కలర్స్ స్వాతి. కానీ నాకు మాత్రం స్వాతిగాడు. ఎందుకంటే కాలేజీ రోజుల నుంచే స్వాతి నాకు బెస్ట్ ఫ్రెండ్. కలర్స్ స్వాతిగా మొదలై స్వాతి అయింది. ఆ తర్వాత స్వాతిగాడు అయింది. ఈ మూవీ స్వాతికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ స్వాతి’’ అని తేజ్ చెప్పుకొచ్చాడు. ఆ వెంటనే స్వాతి ఈ హీరోను హగ్ చేసుకుని బుగ్గపై ముద్దుపెట్టింది.

ఇక స్వాతి మాట్లాడుతూ.. ‘మేం ఇద్దరం కలిసి చదువుకున్నాం. సినిమాల్లోకి నేను ముందే వచ్చేశాను. అలా అని తనకంటే పెద్దదాన్ని అని మీరందరూ అనుకుంటున్నారేమో. కానీ మా ఇద్దరికీ ఒకే వయస్సు. ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నాం. ఎగ్జామ్స్‌లో నేను చూపిస్తేనే పాసయ్యాడు(నవ్వుతూ). ఏడాదిగా కలిసి ‘సత్య’ అనే ప్రాజెక్ట్ చేశాం. తేజు నా లైఫ్‌లో ఎప్పుడూ సపోర్ట్ సిస్టంలా ఉంటూ వస్తున్నాడు. థాంక్యూ తేజు’ అంటూ స్వాతి.. సాయిధరమ్‌ తేజ్‌తో ఉన్న బాండింగ్ గురించి వెల్లడించింది.


More News : విడాకుల గురించి అడిగిన సురేశ్ కొండేటికి చెంప పగలేలా ఆన్సర్ ఇచ్చిన స్వాతి

Next Story

Most Viewed