- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న కలెక్షన్ కింగ్.. ఊహించని సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన విష్ణు
ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా వేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా వేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత కలెక్షన్ కింగ్ డా. ఎం. మోహన్ బాబు(Mohan Babu) ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ 22న ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో నవంబర్ 22న ‘MB50 - ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ (MB50 - A Pearl White Tribute)అనే గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారని సమాచారం. ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా అందరికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు విష్ణు మంచు(Vishnu Manchu) ఏర్పాట్లు చేస్తున్నారు. ఐదు దశాబ్దాలుగా డాక్టర్ మోహన్ బాబు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు.
తన శక్తివంతమైన ప్రదర్శనలు, ఐకానిక్ డైలాగ్ డెలివరీ, తెరపై చూపించిన ప్రతిభ ఎందరికో స్పూర్తిగా నిలుస్తుంటుంది. 600కి పైగా చిత్రాల్లో అతని బహుముఖ ప్రజ్ఞ, క్రమశిక్షణ, కళ పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని చాటుతాయి. MB50 అంటే కేవలం సినీ విజయాలే కాకుండా.. కళ, విద్య, దాతృత్వం పట్ల ఆయన జీవితాంతం చూపిన నిబద్ధతను కూడా సూచిస్తుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా ఒంటరిగా సినీ ప్రయాణం మొదలు పెట్టి.. తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పర్చుకున్న విలక్షణ నటుడుగా ఎదిగిన ఈ జర్నీగురించి అందరికీ మరోసారి చాటి చెప్పబోతోన్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు విష్ణు సర్‌ప్రైజ్ ప్లాన్ అదిరిపోయిందని అభిప్రాయపడుతున్నారు.






