రామోజీరావు అస్తమయం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి!

by Jakkula Samataha |

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన నేడు తన తుది శ్వాస విడిచారు. ఇక ఈయన గొప్ప వ్యాపార వేత్త, అనేక సంస్థలను ప్రారంభించి,

రామోజీరావు అస్తమయం.. ఎమోషనల్ ట్వీట్ చేసిన చిరంజీవి!
X

దిశ, సినిమా : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన నేడు తన తుది శ్వాస విడిచారు. ఇక ఈయన గొప్ప వ్యాపార వేత్త, అనేక సంస్థలను ప్రారంభించి, ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అంతే కాకుండా సినీ పరిశ్రమ అభివృద్ధిలో కూడా ఈయన పాత్ర ఉంది. అలాంటి గొప్ప వ్యక్తి మరణించడంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురి అయ్యారు. దీంతో ఒకొక్కరూ ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రామోజీ రావు మృతి పట్ల తన సంతాపం వ్యక్తం చేస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు.‘‘ ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది’’.. ఓం శాంతి.. గొప్ప వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Next Story