- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.. పవర్ స్టార్‌కు విషెస్ చెప్పిన మెగాస్టార్, అల్లు అర్జున్..
నేడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు.

దిశ, సినిమా: నేడు పవన్ కల్యాణ్ ( Pawan Kalyan )పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. తాజాగా, టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అల్లు అర్జున్(Allu Arjun) పవన్‌కు విషెస్ చెప్తూ ట్విట్టర్ ద్వారా పోస్టులు పెట్టారు. ‘‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ’’ అని రాసుకొచ్చారు. అలాగే అల్లు అర్జున్.. ‘‘మా పవర్ స్టార్ & డిప్యూటీ సీఎం గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అని అన్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.






