- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > Chinna Movie OTT : సిద్ధార్థ్ ‘చిన్నా’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్..
Chinna Movie OTT : సిద్ధార్థ్ ‘చిన్నా’ సినిమాకు ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఫిక్స్..
టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘చిత్త’

X
దిశ, సినిమా: టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం ‘చిత్త’ తమిళంలో సెప్టెంబర్ 28న రిలీజై సక్సెస్ అయింది. దీంతో ఈ సినిమాను తెలుగులో ‘చిన్నా’ పేరుతో అక్టోబర్ 6న రిలీజ్ చేశారు. ఇక తెలుగులో కూడా పర్వాలేదు అనిపించినప్పటికీ కలెక్షన్స్ మాత్రం అంతగా రాబట్టలేక పోయింది. సిద్ధార్థ్‌తోపాటు నిమిష విజయన్, సహస్ర శ్రీ, అంజలీ నాయర్ ప్రధానపాత్రలు పోషించిన ఈ మూవీ.. ఎమోషనల్ పాయింట్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దీంతో తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ కుమార్‌కు భారీ ప్రశంసలు దక్కాయి. లోక నాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజాగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ డిస్నీ+ హాట్‍స్టార్ దక్కించుకుంది. అక్టోబర్ చివరలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది.
Next Story






