కృష్ణంరాజు మృతికి ప్రముఖుల సంతాపం

by Disha Web |
కృష్ణంరాజు మృతికి ప్రముఖుల సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. రెబల్ స్టార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నటులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించగా, ప్రస్తుతం చంద్రబాబు స్పందించారు. కృష్ణంరాజు మరణం తనను కలిచి వేసిందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అంతేగాక, మంచు మనోజ్, నిఖిల్, డైరెక్టర్ మారుతీ సహా పలువురు నటీనటులంతా దిగ్భాంతికి గురయినట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Also Read : టాలీవుడ్ లో తీవ్ర విషాదం... రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత..

Also Read : కృష్ణంరాజు మృతిపై అనుష్క ఎమోషనల్ ట్వీట్..


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed