అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదానికి చెక్ పెట్టిన కావేరీ.. పొరపాటు అయిందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

నాకు అల్లు అర్జున్ టీమ్ నుంచి ఎలాంటి లిస్టు అందలేదు, సమాచారం సరిచూసుకోకుండా మాట్లాడినందుకు నన్ను క్షమించండి.

అల్లు అర్జున్ 42 రూల్స్ వివాదానికి చెక్ పెట్టిన కావేరీ.. పొరపాటు అయిందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)ను కలవాలంటే 42 రకాల నిబంధనలు పాటించాలంటూ సోషల్ మీడియాలో మొదలైన రచ్చకు తెరపడింది. ఈ వివాదానికి మూలకారమైన బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బరువా(Kaveri Barua), తన తప్పును తెలుసుకొని సోషల్ మీడియా వేదికగా పబ్లిక్‌గా సారీ చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా తాను చేసిన కామెంట్లు అల్లు అర్జున్ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమె చింతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కావేరి బరువా.. అల్లు అర్జున్‌ను కలవడానికి ముందు ఆయన టీమ్ తనకు '42 డూస్ అండ్ డోంట్స్' (చేయాల్సినవి, చేయకూడనివి) ఉన్న ఒక లిస్టు ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్తా వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, అల్లు అర్జున్ టీమ్ కూడా స్పందిస్తూ.. అలాంటి లిస్టు ఏదీ లేదని, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది.

దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన కావేరి, ‘‘నాకు అల్లు అర్జున్ టీమ్ నుంచి ఎలాంటి లిస్టు అందలేదు, సమాచారం సరిచూసుకోకుండా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. పొరపాటున అలాంటి మాటలు మాట్లాడాను’’ అని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఇక కావేరి వ్యాఖ్యలు ఉన్న వీడియోను ప్రసారం చేసిన పాడ్‌కాస్టర్ స్వీకృతి కూడా ఈ వివాదంపై స్పందించారు. ఆమె ఆరోపణలు నిజమేనని నమ్మి వీడియో పోస్ట్ చేశామని, ఇప్పుడు వాస్తవం తెలిశాక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఆ రీల్స్ .. పాడ్‌కాస్ట్‌ను డిలీట్ చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నోట్ విడుదల చేశారు. అంతేకాకుండా తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని చెప్తూనే.. ఈ వివాదం కారణంగా హోస్ట్, టీమ్ సభ్యులను సోషల్ మీడియాలో వేధించడం ఆపాలని ఆమె కోరారు. దీంతో గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ రూల్స్ వివాదానికి చెక్ పడినట్లు అయింది.

Next Story