మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు బన్నీ గ్రీన్ సిగ్నల్..?

by Web Desk |
మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు బన్నీ గ్రీన్ సిగ్నల్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్‌ హోదా అందుకున్నాడు. 'పుష్ప' సినిమాతో యావత్ భారత దేశాన్ని షేక్ చేసేశాడు. ప్రస్తుతం 'పుష్ప2' దృష్టి పెట్టాడు. అయితే తాజాగా బన్నీకి తమిళ నిర్మాణ సంస్థ మరో భారీ ఆఫర్ ఇచ్చిందట. పుష్ప సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేసిన లైకా ప్రొడక్షన్స్ వారు తమ నెక్స్ట్ మూవీలో బన్నీని హీరో‌ ఓకే చేశారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

దానికి తోడుగా ఈ సినిమాను కూడా లైకా వారు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ తెరకెక్కించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం బన్నీ భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేశాడని, అందుకు కూడా లైకా ప్రొడక్షన్స్ ఓకే చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను 'పుష్ప2' పూర్తయిన వెంటనే స్టార్ట్ చేస్తారని, ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్, అట్లీ వీరిలో ఒకరు డైరెక్ట్ చేయనున్నారని టాక్ వస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.



Next Story

Most Viewed