BRO Teaser : పవన్ ఫ్యాన్స్‌కి చివరి నిమిషంలో ట్విస్ట్.. మరింత ఆలస్యం!

by Chukka Sudharani |   (  Updated:2023-06-30 15:12:17  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’.

BRO Teaser :  పవన్ ఫ్యాన్స్‌కి చివరి నిమిషంలో ట్విస్ట్.. మరింత ఆలస్యం!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘బ్రో’. డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. టీజర్ కోసం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ మరో షాక్ తగిలింది. చివరి నిమిషంలో టీజర్ రిలీజ్ చేయడానికి కుదరడం లేదు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటూ మరో పోస్ట్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా.. టీజర్ రిలీజ్‌పై కాసేపట్లో స్పష్టమైన ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు.

Read More: పవన్ కల్యాణ్ BRO టీజర్ విడుదల (వీడియో)

Next Story