Brahmamudi: ప్రేక్షకుల్లో హీట్ పెంచేసిన ఈ రోజు సీన్స్.. కావ్య నడుమును పట్టుకుని రొమాన్స్ చేస్తున్న రాజ్

by Disha Web Desk 10 |
Brahmamudi: ప్రేక్షకుల్లో హీట్ పెంచేసిన ఈ రోజు  సీన్స్.. కావ్య నడుమును పట్టుకుని రొమాన్స్ చేస్తున్న రాజ్
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇక రాత్రి అయ్యేసరికి పడుకోవడానికి బెడ్ పట్టుకుని వచ్చిన కావ్యకు నడుము పట్టేస్తుంది. నడుము నొప్పి వల్ల కావ్య ఇబ్బంది పడుతూ ఉంటుంది .. ఆయింట్మెంట్ తీసుకుని తన రాసుకుంటూ ఉంటే.. ల్యాప్ టాప్‌లో వర్క్ చేసుకుంటున్న రాజ్ ఒక్కసారిగా కావ్య వైపు చూస్తాడు. ఉదయం నుంచి ఇంట్లో పనులు చేస్తూ కష్టపడుతున్న సీన్స్ అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు కావ్య .. అలా చూడకపోతే కొంచం సాయం చేయొచ్చు కదా?అని అంటుంది.

అంటే నేను చేద్దామనే అనుకున్నాను.. మళ్లీ నువ్వేం తప్పుగా అనుకుంటావేమో అని రాజ్ అంటాడు. కావ్య చేతిలోని ఆయింట్మెంట్ తీసుకుని నడముకు ఆయింట్మెంట్ రాస్తాడు. అయితే ఆ సమయంలో ఇద్దరూ చాలా రొమాంటిక్‌గా ఫీల్ అవుతారు. రాజ్ చేతిని, కావ్య నడుముని క్లోజ్ అప్‌లో చూపించి.. ప్రేక్షకుల్లో హీట్ పెంచేశారు డైరెక్టర్. ఇక ఆ మూడ్‌లోనే.. రాజ్.. ‘కళావతి.. కళావతీ..’ అంటూ ముద్దుగా పిలుస్తాడు. ఏంటండీ అని అడుగుతుంది కావ్య. ‘నిన్ను ఒకటి అడగొచ్చా? మరి నువ్వు అసలు కోపం తెచ్చుకోవద్దు అంటే అడుగుతాను అని అంటాడు. ‘అంటే.. అది.. ఆ రోజు.. పండుగ రోజు.. గుడికి నువ్వు నిజంగానే మొక్క తీర్చుకోవడానికి వెళ్లావా?’ అని సందేహంగా అడుగుతాడు. ఆ మాటకి కావ్య పైకి లేచి.. నా తిప్పలు నేనే పడతాను అని అంటుంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed