- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ayushmann Khurrana: ‘నేనే అబ్బాయిని అయుంటే..?’.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టార్ హీరో ఎమోషనల్ వీడియో!
కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘనటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది.

దిశ, సినిమా: కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘనటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై ఇప్పటికే చాలా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుండగా.. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా తన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. అందులో ‘నేనే అబ్బాయిని అయితే.. గది తలుపు తాళం వేయకుండానే పడుకోవచ్చు. నేను అబ్బాయిని అయితే రాత్రి, పగలు అని తేడా లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తిరగొచ్చు.. ఈ రోజు నాపై బలాత్కారం జరిగింది. ఓ దుర్మార్గుడి క్రూరత్వాన్ని కళ్లారా చూశాను. అందుకే నేనే అబ్బాయిని అయితే బాగుండేది.. ఒక వేళ నేనూ అబ్బాయిని అయుంటే బతికి ఉండేదాన్ని..!’ అంటూ ఆ మృతిరాలి ఆవేదనను ఆయుష్మాన్ కళ్లకు కట్టినట్లుగా ఓ వీడియో రూపంలో చూపించాడు. ఈ ఎమోషనల్ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘ప్రపంచమంతా మీలాగే ఆలోచించి ఉంటే.. ఇలాంటి దారుణాలు జరగవు’ అని ‘అత్యంత బలమైన సందేశం’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు నెటిజన్లు.






