బాలీవుడ్ వాళ్ళు అర్థరాత్రి అలాంటి పనులు చేస్తారు.. దక్షిణాదిని చూసి నేర్చుకోవాలంటూ సోనాక్షి కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

ఇండస్ట్రీల్లో ఉండే వ్యత్యాసం గురించి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

బాలీవుడ్ వాళ్ళు  అర్థరాత్రి అలాంటి పనులు చేస్తారు.. దక్షిణాదిని చూసి నేర్చుకోవాలంటూ సోనాక్షి కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: ఇండస్ట్రీల్లో ఉండే వ్యత్యాసం గురించి ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కొందరు టాలీవుడ్‌ను పొగిడితే.. మరికొందరు మాత్రం తమ ఇండస్ట్రీనే గొప్ప అన్నట్లుగా మాట్లాడారు. తాజాగా, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) త్వరలో ‘జటాధర’ (Jatadhara)చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ 7న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను గతంలో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నాను. నాకు ఎప్పటినుంచో ప్రాంతీయ సినిమాల్లో చేయాలన్న ఆసక్తి ఉండేది.

కానీ వరుస షెడ్యూల్స్, డేట్స్ కుదరకపోవడం వల్ల ఇబ్బందులు రావడంతో చేయలేదు. దక్షిణాది సినీ పరిశ్రమలో నాకు కొన్ని విషయాలు నచ్చాయి. ఇక్కడ సమయపాలన పాటిస్తారు.. బాలీవుడ్ ఈ విషయాన్ని నేర్చుకోవాలి. టాలీవుడ్‌లో తొమ్మిది గంటలకు షూటింగ్‌కు వస్తే సాయంత్రం ఆరు వరకు పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ నిర్వహించరు. ఇది చాలా మంచి విషయం ఇలా చేయాలంటే క్రమశిక్షణ అవసరం. కానీ హిందీ పరిశ్రమలో ఇలాంటివి ఉండవు. అర్ధరాత్రి వరకు షూటింగ్స్ జరుగుతుంటాయి.. సమయపాలన అంటూ ఉండదు అది నాకు అస్సలు నచ్చలేదు.

ఈ విషయంలో టాలీవుడ్‌ను చూసి హిందీ వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. ‘జటాధర’లో నవ దళపతి సుధీర్ బాబు(Sudheer Babu) సరసన నటించనుంది. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోద్కర్ కీలక పాత్ర పోషించారు.

Next Story