- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘట్టమనేని వారసుడి మూవీలో స్టార్ హీరోయిన్ కూతురు ఫిక్స్.. అధికారిక ప్రకటన చేసిన డైరెక్టర్
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni)ఇండస్ట్రీకి రాబోతున్నాడు. ఈ సినిమాకు RX100, మంగళవారం, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించిన అజయ్ భూపతి (Ajay Bhupathi)తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌కు చెందిన అశ్విని దత్ సమర్పిస్తుండగా.. చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.
కఠినమైన కొండల ఉత్కంఠభరితమైన నేపథ్యంలో, మట్టి వాస్తవికతలో పాతుకుపోయిన ఒక తీవ్రమైన ప్రేమకథగా నిర్మించబడిన ఈ చిత్రం అన్ని భావోద్వేగాలతో రాబోతుంది. ‘AB-4’వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నారు. ఇక ఇందులో జయకృష్ణ సరసన రాషా తడాని నటిస్తున్న గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, అజయ్ భూపతి జయకృష్ణకు జోడీగా బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడాని(Rasha Thadani) కథానాయికగా నటిస్తున్నట్లు వెల్లడించారు.
‘‘AB-4 ప్రాజెక్ట్‌లోకి జాతీయ సంచలనం రాషా తడానిని స్వాగతిస్తున్నాం. ఆమె నటనతో అందరినీ మంత్రముగ్దులను చేయనుంది. ప్రేక్షకులు కచ్చితంగా రాషా తడానితో ప్రేమలో పడతారు’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే బ్లాక్ టీ షర్ట్, జీన్స్ ధరించి ఓ బైక్‌పై కూర్చుని ఉన్న రాషా హాట్ లుక్‌ను కూడా షేర్ చేశారు. అయితే ఈ సినిమాతో రాషా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుండటం విశేషం. జయకృష్ణ, రాషా కెమిస్ట్రీ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.






