- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్జరీ వికటించడంతో అంద వికారంగా మారిన బోల్డ్ బ్యూటీ.. అవసరమా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్(Urfi Javed) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయింది. ఈక్రమంలోనూ ఉర్ఫీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. అక్కడ పలు టాస్కులు ఆడిన ఆమె విన్నర్ కాలేకపోయింది. కొద్ది రోజులకే బయటకు వచ్చేసి తన ఫ్యాషన్‌తో విపరీతమైన పాపులారిటీని దక్కించుకుంది. వెరైటీ డ్రెస్సులు ధరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత కొద్ది కాలంగా ఉర్ఫీ ఏ సినిమాలు షోలు చేయనప్పటికీ సోషల్ మీడియా ద్వారానే చాలామంది ఫాలోవర్స్‌ను రాబట్టుకుంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది. వారానికి రెండు వెరైటీ డ్రెస్సులు అయినా తయారు చేయించుకుని రోడ్లపై తిరుగుతూ ట్రోల్స్‌కు గురవుతుంటుంది.
అయినప్పటికీ అవన్నీ పట్టించుకోకుండా పలు వస్తువులతో వెరైటీ దుస్తులు రెడీ చేసి ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఉర్ఫీ జావెద్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమె ముఖమంతా ఉబ్బిపోయి, పెదాలు ఎర్రగా కందిపోయి కనిపించాయి. దీంతో సడెన్‌గా చూసిన వారంతా ఉర్ఫీకి ఏమైందని కంగారు పడిపోతున్నారు. అసలు విషయంలోకి వెళితే.. ఉర్ఫీ తొమ్మిదేళ్ల క్రితం తాను సర్జరీ చేయించుకున్నట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ‘‘లిప్ ఫిల్లర్స్ విషయంలో కృత్రిమ పద్ధతిని ఉపయోగించి తప్పు చేశాను. అప్పుడు నా రూపు చూసుకుని నేను ఎంతగానో నవ్వుకున్నాను.
చివరకు నా పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇన్నాళ్లకు నా లిప్ ఫిల్లర్లను కరిగించుకున్నాను. ఎవరూ నాలాగా తప్పు చేయొద్దు. ఒకవేళ లిప్ ఫిల్లింగ్ చేయాలనుకుంటే కచ్చితంగా అనుభవం ఉండే డాక్టర్ దగ్గరకు మాత్రమే వెళ్ళండి’’ అని చెప్పుకొచ్చింది. అలాగే పాత ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇక అందులో ఆమె సర్జరీ వల్ల ముఖమంతా వాచిపోయింది. అంతేకాకుండా ఉబ్బిన పెదాలకు ఇంజెక్షన్ వేసుకుంటూ కనిపించింది. ఇక ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు అవసరమా సర్జరీలు అని పొట్టు పొట్టు తిడుతున్నారు.






