బర్త్ డే సర్ ప్రైజ్: ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో అనుపమ్ ఖేర్.. పోస్టర్ అదిరిపోయిందిగా!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

బర్త్ డే సర్ ప్రైజ్: ప్రభాస్-హను రాఘవపూడి సినిమాలో అనుపమ్ ఖేర్.. పోస్టర్ అదిరిపోయిందిగా!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియడ్ డ్రామా ‘ఫౌజీ’ (Fauji). అనౌన్స్‌మెంట్ నుండే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా.. ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అనుపమ్ ఖేర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ సినిమా మూడ్‌ను ప్రతిబింబించేలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఇందులో అనుపమ్ ఖేర్ ముందు ఏవో వస్తువులు కాలిపోతూ మంటలు వస్తుండగా, ఆయన సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. యుద్ధం, ఎమోషన్స్ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. గతంలో అనుపమ్ ఖేర్ తెలుగులో ‘కార్తికేయ 2’ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు, ఇప్పుడు ప్రభాస్ సినిమాలో ఆయన భాగం కావడం మూవీపై హైప్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌ను హను రాఘవపూడి ఒక సరికొత్త ఆర్మీ ఆఫీసర్ లుక్‌లో చూపించబోతుండటంతో అభిమానులు ‘ఫౌజీ’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Next Story