కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు ఇవ్వరు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!

by Disha Web Desk 8 |
కమిట్మెంట్ ఇచ్చినా అవకాశాలు ఇవ్వరు.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్. దీనిపై చాలా మంది హీరోయిన్స్ ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. కాగా, తాజాగా బిగ్ బాస్ బ్యూటీ హిమజ ఇండస్ట్రీలో జరిగే కాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ గురించి ఓపెన్‌గా చెప్పుకొచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యలను తెలిపింది. హిమజ మాట్లాడుతూ..చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదు. ముఖ్యంగా కమిట్మెంట్ ఇస్తేనే వస్తాయి అనేది తప్పు, కమిట్మెంట్ ఇచ్చిన వారందరికీ అవకాశాలు రావడం లేదు, అలా అని వచ్చిన వారు కమిట్మెంట్ ఇచ్చినట్లు కాదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ, కానీ వారు కూడా వాటిని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా కొంత మంది అత్యాశకు పోయి వచ్చిన ఆఫర్స్‌ను రిజెక్ట్ చేస్తుంటారు. ఇది కరెక్ట్ కాదు..ప్రతి అవకాశం ఉపయోగించుకున్నప్పుడే మన టాలెంట్ బయటపడుతుందంన్నారు. అలాగే తెలుగు అమ్మాయిలు రిజర్వ్‌డుగా ఉంటారని కొందరు చెబుతుంటారు, కానీ అది తప్పు అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం హిమజ చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed