ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావ్.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్

by Anjali |
ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నావ్.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ గెలవాలని మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడుతూ.. అన్నీ వర్గాలకు న్యాయం అందాలంటే, ఈ దేశంలో రాజ్యాంగం అమలు కావాలంటే కాంగ్రెస్ తప్పక విజయం సాధించాలని అన్నారు. పదండి ఓటుతో నియంతృత్వంపై వేటేద్దాం-కాంగ్రెస్‌ను గెలిపిద్దాం అని నినాదాలు ఇచ్చారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులవుతోన్న హామీలు అమలు చేయడం లేదని కేసీఆర్ అసత్య ప్రచారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని.. బీఆర్ఆర్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వెల్లడించారు. అవినీతి ఆరోపణలతో బిడ్డ జైలుకెళ్లినా ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నాడని కేసీఆర్‌ను నిలదీశాడు. బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాని మంత్రి కోమటిరెడ్డి ప్రజలను కోరారు.

Read More...

అలక వీడారు.. తిరిగి కాంగ్రెస్‌లో చేరిన ఆ మాజీ నేతలు

Next Story

Most Viewed