సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కినేని అమల ప్రేమ పెళ్లి చేసుకున్నారా..! హాట్ హాట్‌గా వైరల్ అవుతున్న మ్యారెజ్ ఫొటోలు

by Disha Web Desk 7 |
సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కినేని అమల ప్రేమ పెళ్లి చేసుకున్నారా..! హాట్ హాట్‌గా వైరల్ అవుతున్న మ్యారెజ్ ఫొటోలు
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది ‘జైలర్’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. తర్వాత తన కూతురు ఐశ్వర్య తీసిన ‘లాల్ సలాం’ సినిమాలో నటించి మెప్పించిన ఆయన.. ప్రస్తుతం తన తదుపరి చిత్రమైన ‘Thalaivar171’ బిజీగా ఉన్నాడు. ‘లియో’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే అప్‌డేట్స్ రాగా.. నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. సూపర్ స్టార్ రజినీకాంత్, అక్కినేని అమల పెళ్లి చేసుకున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అదేంటి.. అమల అక్కినేని నాగర్జున భార్య కదా..? రజినీతో పెళ్లి ఫొటోలు వైరల్ అవ్వడం ఏంటీ అనుకుంటున్నారా. అయితే.. అమల పెళ్లికి ముందు హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రజినీకాంత్, అమల కలిసి నటించిన చిత్రం ‘మప్పిల్లై’. తమిళంలో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు రాజశేఖర్‌ రూపొందించాడు. ఈ మూవీ క్లైమాక్స్‌లో రజనీకాంత్, అమల పెళ్లి సీన్ ఉంటుంది. అంతే కాకుండా రజినీకాంత్, అమల ప్రేమ పెళ్లి చేసుకోబోతుండగా.. రౌడీలు అడ్డుపడతారు. అప్పుడు మెగాస్టార్ చిరంజీవి వచ్చి వారి పెళ్లి జరిపిస్తాడు. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్ అన్న మాట. కాగా.. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story