వ‌చ్చేది కూట‌మి ప్ర‌భుత్వ‌మే..వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది:పవన్ కళ్యాణ్

by Mamatha |
వ‌చ్చేది కూట‌మి ప్ర‌భుత్వ‌మే..వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది:పవన్ కళ్యాణ్
X

దిశ‌, పిఠాపురం: ఫ్యాన్‌ను బైక్ కి క‌ట్టి ఈడ్చేద్దాం..కూట‌మి ప్ర‌భుత్వం రాబోతుంది. వైసీపీ చిత్తుగా ఓడిపోతుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని 15 గ్రామాల‌కు పైబ‌డి విస్తృత ప‌ర్య‌ట‌న చేశారు. రోడ్ షోతో ఆక‌ట్టుకున్నారు. అడుగ‌డుగునా ప‌వ‌న్‌కు జ‌న నీరాజ‌నం ప‌లికారు. మండె ఎండ‌లోనూ ఎక్క‌డిక‌క్క‌డ కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ‌ప‌రుస్తూ జ‌న‌సేన, టీడీపీ, బీజేపీ కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు ప‌వ‌న్‌. రాష్ట్రంలో వచ్చేది “జనసేన - టీడీపీ - బీజేపీ” కూటమి ప్రభుత్వమేనని..వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జనసేన పార్టీ అధ్య‌క్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. అరటి పండు తొక్క ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో పడేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

సోమవారం ప‌వ‌న్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ‌, బీజేపీ ఇన్‌ఛార్జి కృష్ణంరాజుతో క‌లిసి, పిఠాపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..“రాష్ట్రం బాగుండాలి, ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించే వాడిన‌ని అన్నారు. చంద్ర‌బాబుపై 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ కారణంగా అరెస్ట్ చేయడం బాధ క‌లిగించింద‌న్నారు. అప్పుడు నిర్ణ‌యించుకుని, ఎవ‌రెమ‌నుకున్నా వైసీపీ లాంటి రాక్ష‌స పాల‌న ఉండ‌కూడ‌ద‌నే పొత్తు పెట్టుకున్నామ‌ని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని అందులో భాగంగానే అన్ని విధాలుగా తగ్గించుకొని పొత్తు పెట్టుకున్నామ‌ని ప‌వ‌న్ గుర్తు చేశారు. పిఠాపురంలో త‌న గెలుపుకు కృషి చేస్తున్న టీడీపీ నేత వర్మను చట్ట సభలకు పంపించే బాధ్యత తీసుకుంటామ‌ని ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు. పిఠాపురాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామ‌ని హామి ఇచ్చారు.


Read More...

పుస్తకాలపై జగన్ ఫొటో ఎందుకు? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed