ఎన్నికల నిర్వహణలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం

by Disha Web Desk 15 |
ఎన్నికల నిర్వహణలో పీఓ, ఏపీఓల పాత్ర కీలకం
X

దిశ, హైదరాబాద్ బ్యూరో : ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పీఓ, ఏపీఓ లకు మలక్ పేట్ లోని ముంతాజ్ డిగ్రీ అండ్ పీజీ ఇంజనీరింగ్ కళాశాలలో, కోఠి లోని ఉస్మానియా ప్రభుత్వ మహిళా యూనివర్సిటీ లో నిరహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో

పీఓ,ఏపీఓ, ఓపీఓల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ రోజు, పోలింగ్ ముందు రోజు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఈవీఎం మెషిన్ ల సక్రమ నిర్వహణ, మాక్ పోల్, పీఓ డైరీ, 7ఏ, 7సీ, బుక్ లెట్ వంటివి సరిగా నింపి ఎన్నికలను విజయవంతం చేయాలని అన్నారు. పోలింగ్ రోజు ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ మొదలు పెట్టాలని, రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్స్ రాకుంటే 15 నిముషాలు వేచిచూసి కచ్చితంగా ఉదయం 5.45 గంటలకు మాక్ పోలింగ్ స్టార్ట్ చేయాలని, ఎలాంటి తప్పులు లేకుండా ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎల్ఎంలు, పీఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.

Next Story