ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

బుల్లితెర నటి ప్రియాంక జైన్(Priyanka Jain) ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.

ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందంటూ బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి ప్రియాంక జైన్(Priyanka Jain) ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన ఆమె తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లోకి వెళ్లి మరింత పాపులారిటీని పెంచుకుంది. పలు టాస్కుల్లో పాల్గొన్న ప్రియాంక విన్నర్ కాలేకపోయింది. కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. ఇక ప్రియాంక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా ఆమె బుల్లితెర హీరో శివకుమార్‌(Shivakumar)తో ప్రేమలో ఉంది. వీరిద్దరు పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో ఉంటున్న విషయం తెలిసిందే. పలు షోస్‌లో కూడా పాల్గొంటున్నారు. అలాగే యూట్యూబ్‌ వ్లాగ్స్ చేస్తూ చేతినిండా సంపాదిస్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈక్రమంలోనే.. ఈ ఏడాది పెళ్లి చేసుకుంటామని అనౌన్స్ చేశారు. కానీ ఇది ఇప్పుడే జరిగేలా లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. గత ఏడాది స్థలం కొని మంచి రోజు చూసి ఇల్లు స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘కోటి రూపాయల లోన్‌తో ఇల్లు కట్టుకుంటున్నాము. ఇది కేవలం ఇటుకలతో కాదు.. ఎన్నో ఆశలతో, కలలతో నిర్మితమవుతోన్న ఇల్లు. నిలువైన గోడల్ని చూస్తుంటే మా భవిష్యత్తు కళ్ల ముందు కనిపిస్తోంది. ఇక్కడ కేవలం ఇంటికి పునాది పడలేదు. జీవితకాల జ్ఞాపకాల సమాహారానికి పునాది పడింది. ఈ కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇక్కడ అందమైన జ్ఞాపకాలను కూడబెట్టుకునేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం. ఇది మా శాశ్వత నివాసం’’ అని రాసుకొచ్చింది. అలాగే ప్రియుడితో ఇంటి పనులు చేస్తున్న వీడియోను షేర్ చేసింది. దీంతో షాక్ అవుతున్న నెటిజన్లు ముందు పెళ్లి చేసుకోండని సలహా ఇస్తున్నారు.

Next Story