- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారర్ సినిమా సీక్వెల్‌పై బిగ్ అప్డేట్.. ఒళ్ళు గగుర్పొడిచే పోస్టర్‌తో షాకిచ్చిన మేకర్స్
హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘రాజు గారి గది’. ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, సినిమా: హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన సినిమా ‘రాజు గారి గది’. ఈ చిత్రం అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో మూవీ మేకర్స్ 2017లో దీనికి సీక్వెల్ తెరకెక్కించగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక 2019లో ‘రాజుగారి గది-3’ వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు దసరా పండుగ కానుకగా.. చిత్రబృందం త్వరలో ఈ సినిమాకు సీక్వెల్‌గా(RajuGariGadhi4)రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మూవీని వచ్చే ఏడాది దసరా కానుకగా కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఓంకార్(Omkar) దర్శకత్వంలో రాబోతుండగా.. ఇటీవల ‘మిరాయ్’తో హిట్ అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒళ్ళు గగుర్పొడిచేలాగా ఉంది.. ఎరుపు రంగు చీరకట్టుకున్న ఒక మహిళ గాల్లో తేలుతూ కనిపించగా.. ఆమె ముందు శక్తివంతమైన కాళీమాత విగ్రహం కనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి ‘ఏ డివైన్ హారర్ బిగన్స్’ అనే ట్యాగ్‌లైన్ జోడించడంతో భయానక సన్నివేశాలు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇక ఈ పోస్ట్‌కు.. భక్తి విరిగిపోయినప్పుడు... ఆమె కోపం మేల్కొంటుంది. ఈ శుభ విజయదశమి నాడు, తెలుగు సినిమాను కుదిపేసిన భయానక గాథ తిరిగి వచ్చింది. భయపడేందుకు సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.






