‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ నుంచి బిగ్ అప్డేట్.. న్యూ మిషన్ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారుగా! (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-28 07:11:02  IST  )

గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

‘ది ఫ్యామిలీ మ్యాన్-3’ నుంచి బిగ్ అప్డేట్.. న్యూ మిషన్ అంటూ సర్‌ప్రైజ్ ఇచ్చారుగా! (వీడియో)
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. ఇందులో పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలా ప్రేక్షకులను బాగా అలరించిన సిరీస్‌ల్లో ‘ఫ్యామిలీ మ్యాన్’ (Family Man)కూడా ఒకటి. అయితే 2019లో వచ్చిన ఈ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇందులో సమంత(Samantha) మరీ బోల్డ్‌గా నటించి విమర్శల పాలైంది. అయినప్పటికీ ఈ సిరీస్ మంచి రెస్సాన్స్‌ను దక్కించుకోవడంతో మేకర్స్ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌కు సీక్వెల్ తెరకెక్కించారు. అది కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సిరీస్‌ ముచ్చటగా మూడోసారి అలరించడానికి సిద్ధమైంది.

ఇందులో మనోజ్ బాజ్‌పాజ్(Manoj Bajpaz) ప్రధాన పాత్రలో నటించగా.. ప్రియమణి(Priyamani), షరీబ్ హష్మి, ఆశ్లేష ఠాకూర్, శరద్ ఖేల్కర్, సందీప్ కిషన్(Sundeep Kishan), గూల్‌పనాగ్, శ్రేయా ధన్వంతరి, అభయ్ వర్మ(Abhay Verma), సన్నీ హిందూజా కీలక పాత్రలో కనిపించారు. ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, మేకర్స్ ప్రేక్షకులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇక ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ ఈజ్ బ్యాక్ న్యూ సీజన్, కొత్త మిషన్ కోసం వేచి ఉండండి అని తెలిపారు. అలాగే నవంబర్‌లో మీ ముందుకు రాబోతుందని హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సూపర్ ఎక్జైటెడ్‌గా ఉన్నాం వేచి ఉండలేకపోతున్నామని ఫైర్ ఎమోజీలు జోడిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story