- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Mahesh Babu: మీ ప్రేమకు బిగ్ థాంక్యూ.. వైరల్‌గా మహేశ్ బాబు ట్వీట్
దిశ, సినిమా: ఈ ఏడాది ‘గుంటూరు కారంతో’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రిన్స్ మహేశ్ బాబు.. తన తదుపరి చిత్రం రాజమౌళి డైరెక్షన్‌లో చేయబోతున్న విషయం తెలిసిందే. ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిన్న (ఆగస్టు 9) ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు కావడంతో.. సోషల్ మీడియా వేదికగా.. విషెస్ వెల్లువెత్తాయి. అలాగే కొన్ని చోట్ల ఫ్యాన్స్.. అన్నదానాలు, రక్త దానం, పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన ఫ్యాన్స్‌ను, శ్రేయోభిలాసులను ఉద్దేశిస్తూ మహేశ్ బాబు తన ‘X’ ఖాతా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు.
‘మీరు చూపిన ప్రేమ, పంపిన సందేశాలు, ఆశీస్సులకు నేను ఎంతో సంతోషించాను. నా బర్త్‌డేను మీరంతా ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చారు. ఎల్లప్పుడూ మీరు నాకు ఇచ్చే మద్దతు, చూపే ప్రేమకు బిగ్ థాంక్యూ. లవ్ యూ ఆల్’ అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. నిన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు స్పెషల్‌గా ‘మురారీ’ సినిమా రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో థియేటర్ల మొత్తం మోతమోగిపోయాయి.
Overwhelmed with all the love, messages, and blessings I received yesterday on my birthday. Each one of you made my day extra special and memorable. For all the love and support you've always shown me, year after year... A big, big thank you 🙏 Love you all ♥️♥️♥️
— Mahesh Babu (@urstrulyMahesh) August 10, 2024