- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మిరాయ్’లో బిగ్ సర్‌ప్రైజ్.. నేటి నుంచే థియేటర్స్‌లో చూడొచ్చంటూ మూవీ మేకర్స్ పోస్ట్
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Teja Sajja) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’(Mirai). సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా ప్రేక్షకులను అలరించడంతో పాటు థ్రిల్ ఇస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద రూ.134 కోట్లకు పైగా వసూలు చేసిన ‘మిరాయ్’ పలు రికార్డులు సృష్టిస్తోంది. కానీ ప్రేక్షకులు మాత్రం ఒకే విషయంలో నిరాశకు చెందుతున్నారు. విడుదలకు ముందు విడుదలైన ‘వైబ్’ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.
కానీ సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో చిత్రబృందం ఈ పాటను తొలగించేశారు. దీంతో థియేటర్స్‌కి వెళ్లిన వారు ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఆ పాట ‘మిరాయ్’లో పెట్టాలని ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా పలు పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయంపై మూవీ టీమ్ స్పందించింది. ప్రేక్షకుల డిమాండ్ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ శుభవార్తను వెల్లడించారు. మంచి జోష్‌తో సాగే ‘వైబ్’ సాంగ్‌ను నేటి నుంచి థియేటర్స్‌లో జత చేయబోతున్నట్లు తెలిపారు.
‘‘చాట్‌బ్లస్టర్ ‘వైబ్’ సాంగ్‌ను నేటినుంచి ప్రపంచవ్యాప్తంగా ‘మిరాయ్’ ప్రదర్శితమవుతున్న అన్ని షోలలోనూ యాడ్ చేస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. దీంతో అది చూసిన సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో శ్రియా శరణ్, జగపతి బాబు, మంచు మనోజ్, జయరామ్ కీలక పాత్రలో కనిపించారు. పీపుల్ మీడియా బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు గౌర హరి సంగీతం అందించారు.






