- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో విశాల్‌కు బిగ్ షాక్.. రూ.21 కోట్లు కట్టి తీరాల్సిందేనంటూ కోర్టు ఆదేశాలు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తున్నాడు. అయితే ఆయన ఇటీవల ‘మదగజరాజ’ (Madagajaraja)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. 12 ఏళ్లముందు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు.. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా, విశాల్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాకిచ్చినట్లు సమాచారం. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్(Lyca Productions)కు 30 శాతం వడ్డీతో రూ. 21 కోట్లు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దానికి కారణం ఏంటంటే.. విశాల్, లైకా మధ్య కొన్నాళ్లక్రిత్ ఓ సినిమా విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ. 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారంటూ.. ఆ డబ్బు తిరికి చెల్లించలదని హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా డబ్బులు తిరిగి ఇచ్చేవరకు విశాల్ నిర్మించే సినిమా హక్కులను తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మించిన ‘వీరమై వాడై చూడుమ్’ తెలుగులో ‘సామాన్యుడు’ పేరుతో వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను వేరే సంస్థకు అమ్ముకోవడంతో పంచాయతీ మొదలైంది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ వివాదంపై కోర్టు విచారణ జరిపి డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.






