- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరో బర్త్ డే ట్రీట్ ఇవ్వబోతున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ టీమ్.. బిగ్ అప్డేట్‌కు ముహూర్తం ఫిక్స్
సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Chandrahas) మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.

దిశ, సినిమా: సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్(Chandrahas) మొదటి చిత్రంలోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha) అంటూ ఆడియెన్స్‌ను మరోసారి మెప్పించేందుకు రెడీ అవుతున్నారు. జైరామ్ చిటికెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని పివికె ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా, చంద్రహాస్ నూతన చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది.ఈ మేరకు సందీప్ కిషన్(Sundeep Kishan) ఈ కొత్త చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కథలో దేశ భక్తికి సంబంధించిన అంశాల్ని కూడా జోడించినట్టుగా అనిపిస్తోంది. ఐదు రూపాయల బిళ్ల, వాటి చుట్టూ ఉన్న బుల్లెట్లు, పోస్టర్‌ను డిజైన్ చేసిన తీరు చూస్తుంటే మంచి పవర్ ఫుల్ స్టోరీతోనే సినిమా రాబోతోందని అర్థం అవుతోంది. ఇక చంద్రహాస్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 17న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతోన్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు.






