బాలయ్య వివాదంలోకి చిరంజీవిని లాగిన బండ్ల గణేష్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
బాలయ్య వివాదంలోకి చిరంజీవిని లాగిన బండ్ల గణేష్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వీరాసింహ రెడ్డి సినిమా విజయోత్సావంలో బాలయ్య బాబు టంగ్ స్లిప్ అయినా సంగతి తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్‌ను పుట్టిస్తున్నాయి. బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే పలువురు స్పందించారు. అక్కినేని వారసులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. బాలయ్య బాబు మాటలకు తాజాగా బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యాడు. కానీ.. ఆయన పెట్టిన పోస్ట్ సరికొత్త వివాదానికి తెరలేపింది.

అక్కినేని వారసులు పెట్టిన ట్వీట్‌ను పోస్ట్ చేస్తూ అందులో ''ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ ఇంకా చిరంజీవికి మేము రెస్పెక్ట్ ఇస్తాం'' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త వైరల్ కావడంతో దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ''మధ్యలో చిరంజీవిని ఎందుకు ఇరికించావు.. చిరంజీవిని లాగి మొత్తం పెంట చేశావ్.. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్, చిరంజీవి లెజెండ్స్ అయితే కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, అల్లు రామలింగయ్యలకు గౌరవం ఇవ్వవా.. 'కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబుల కంటే చిరంజీవి తోపా'' అంటూ రకరకాల కామెంట్‌లతో బండ్లను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్స్.


Next Story

Most Viewed