చిన్న సినిమాల్లో బలగం సినిమా ఓ బాహుబలి: ఆలీ

by Disha Web Desk 12 |
చిన్న సినిమాల్లో బలగం సినిమా ఓ బాహుబలి: ఆలీ
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడియర్ వేణు(టిల్లు) డైరెక్టర్ గా ప్రియదర్శ్ హీరోగా పక్కా తెలంగాణ సంస్కృతి లో వచ్చిన సినిమా బలగం. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా కొంతమంది సినీ యాక్టర్లు మాత్రమే నటించగా పూర్తిగా గ్రామ ప్రజలతోనే ఈ సినిమాను వేణు చిత్రీకరించాడు. ఓపెనింగ్ నుంచే అన్ని టీవీ, సినీ చానెళ్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న బలగం టీం.. రెండో వారంలో మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్‌లో ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చుతుంది.

ఈ క్రమంలోనే బలగం టీం తమ సక్సెస్ మీట్‌లను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ కమెడియన్, నటుడు ఆలీ పాల్గొని బలగం సినిమాను చిన్న సినిమాల్లో బాహుబలిగా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా. దిల్ రాజ్ ఎప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమా ఏదైనా సరే తన సపోర్ట్ ఇస్తారని మంచి సినిమాలను గుర్తించడంలో, అలాగే టాలెంట్ ఉన్న వారికి ఛాన్స్ ఇచ్చే క్రమంలో దిల్ రాజు ఎప్పుడు ముందుంటారని ఆలీ చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం బలగం సినిమా అన్ని సెంటర్లలో మంచి లాభాలను రాబాడుతు ముందుకు సాగుతుంది.



Next Story