- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాడ్ గాళ్స్.. కానీ మంచోళ్లు..
ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధానపాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో

దిశ, సినిమా : ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై ఫణి ప్రదీప్ ధూళిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘బ్యాడ్ గాళ్స్’. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. రేణు దేశాయ్, అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ, మొయిన్, రోహన్ సూర్య ప్రధానపాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రం క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. ఈ క్రమంలో డైరెక్టర్ మారుతి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన మారుతి.. ‘ట్రైలర్ చాలా బాగుంది. ప్రామిసింగ్‌గా అనిపించింది. దర్శకుడు ఫణి ప్రదీప్ ధూళిపూడి (మున్నా) నాకు చిరకాల మిత్రుడు. ఇండస్ట్రీలో సాధు జీవి. మంచి సంగీత జ్ఞానం ఉన్నవాడు. తన మొదటి చిత్రం ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’లో నీలి నీలి ఆకాశం పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. ఒక మంచి విషయాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒక ఐదుగురు కొత్త అమ్మాయిలతో సినిమా చేయడం.. ప్రొడక్షన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా పూర్తి చేయడం.. తన ప్యాషన్‌కి నిదర్శనం. సినిమా టైటిల్ మాత్రమే ‘బ్యాడ్ గాళ్స్’ కానీ సినిమా అంతా పాజిటివ్‌గా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు, ఆడవారికి ఇంపార్టెంట్ ఇచ్చే సినిమా తప్పక ఆడాలి. ఈనాటి ఆడపిల్లలు ఎలా ఉన్నారు? వాళ్ళ ఆలోచన విధానం? వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు? అనే కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం ఇది. తప్పక చూడండి. ఈ ‘బ్యాడ్ గాళ్స్’ చిత్రాన్ని ఆదరించండి’ అని ప్రేక్షకులను కోరాడు.






