- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మర్ బరిలో ‘అతిరది’ మూవీ.. విడుదల తేదీ ప్రకటించిన టోవినో థామస్
మలయాళంలో యాక్షన్ కామెడీ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉత్కంఠకు గురిచేయనుందట.

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో టోవినో థామస్, తనదైన స్టైల్ యాక్షన్, కామెడీతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈయన బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్‌లతో కలిసి నటిస్తున్న లేటెస్ట్ మల్టీ-స్టారర్ మూవీ ‘అతిరది’. అనిరుధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ప్రస్తుతం మలయాళంలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ‘అతిరది’ ప్రధానంగా క్యాంపస్ నేపథ్యంలో సాగే స్నేహం, యాక్షన్ డ్రామాగా రాబోతున్నట్లు సమాచారం. ఇద్దరు ప్రత్యర్థుల మధ్య జరిగే తీవ్రమైన క్యాంపస్ వైరం, వారి జీవితాల్లోకి మూడో వ్యక్తి ప్రవేశించాక పరిస్థితులు ఎలా మారుతాయనే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళంలో యాక్షన్ కామెడీ సినిమాలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, ఈ చిత్రం కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో పాటు, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఉత్కంఠకు గురిచేయనుందట. ఈ చిత్రానికి విష్ణు విజయ్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని సమ్మర్ సీజన్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
ఈ వేసవిలో ఇప్పటికే పలు భారీ సినిమాలు విడుదలవుతుండగా, వాటితో పోటీ పడేందుకు ‘అతిరది’ సిద్ధమైంది. తాజాగా, టోవినో థామస్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మే 14న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోస్టర్‌లో టోవినో థామస్ కొంతమంది వ్యక్తుల గొంతు పట్టుకుని కొడుతున్నట్లుగా ఉన్న దృశ్యం, సినిమాలో యాక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. టోవినో థామస్, బాసిల్ జోసెఫ్, వినీత్ శ్రీనివాసన్ వంటి టాలెంటెడ్ నటులు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో, వారి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందని సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ పనులు పూర్తి కావడంతో, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై చిత్ర యూనిట్ దృష్టి పెట్టింది. ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు ‘అతిరది’ పక్కా ప్లాన్‌తో వస్తోంది.






