శ్రీనువైట్ల టైమ్ ట్రావెల్ మూవీలో గోల్డెన్ చాన్స్ దక్కించుకున్న ఆషికా రంగనాథ్!

by Mallepaka Hamsa |

చార్మింగ్ స్టార్ శర్వానంద్ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు విభిన్నమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను జోడించి ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు.

శ్రీనువైట్ల టైమ్ ట్రావెల్ మూవీలో గోల్డెన్ చాన్స్ దక్కించుకున్న ఆషికా రంగనాథ్!
X

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది. ‘నా సామి రంగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయిన ఈ ముద్దుగుమ్మ, ఇటీవల మాస్ మహారాజా రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో తన కామెడీ టైమింగ్, గ్లామర్‌తో థియేటర్లలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా చార్మింగ్ స్టార్ శర్వానంద్ - శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు విభిన్నమైన టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను జోడించి ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఇందులో ఆషికా మెయిన్ హీరోయిన్‌గా గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలో శర్వానంద్ సరసన జోడీగా నటించే లక్కీ హీరోయిన్ ఎవరనే విషయంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

ఇక ఇప్పుడు చిత్రబృందం ఆషికాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. శర్వానంద్ క్లాస్ ఇమేజ్‌కు, ఆషికా గ్లామర్‌కు తోడు శ్రీనువైట్ల మార్క్ కామెడీ టైమింగ్ కూడా తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా సంచలనం సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా సీనియర్ స్టార్ హీరోల సరసన జోడీ కట్టిన ఆషికా రంగనాథ్.. మొదటిసారి యంగ్ స్టార్ శర్వానంద్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ భారీ చిత్రంలో ఆషికా క్యారెక్టర్ చాలా ఫన్నీగా, కథను నడిపించే పవర్‌ఫుల్ పాత్రగా ఉండబోతోందని సమాచారం. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే జులై నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం.

Next Story