- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న 46 అవార్డులు సొంతం చేసుకున్న సినిమా.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
విజయ రామరాజు(Vijaya Rama Raju) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’(arjun chakravarthy) ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

దిశ, సినిమా: విజయ రామరాజు(Vijaya Rama Raju) ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’(arjun chakravarthy) ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు. 46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో భావోద్వేగాలు, లవ్ స్టొరీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం మొత్తం కుటుంబం కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ వీకెండ్‌లో యూత్, ఫ్యామిలీ, అందరూ కలసి చూడటానికి ‘అర్జున్ చక్రవర్తి’ పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీంతో సినీ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.






