- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటి లగేజ్‌లో ఎండుమిర్చి, అల్లం.. దాన్ని కంట్రోల్ చేసుకునేందుకేనట
‘ఖత్రోన్ కే ఖిలాడీ 13’ షూటింగ్‌లో పాల్గొనేందుకు ప్యాక్ చేసుకున్న లగేజ్ లిస్ట్‌ను అభిమానులతో పంచుకుంది అర్చనా గౌతమ్.

దిశ, సినిమా : ‘ఖత్రోన్ కే ఖిలాడీ 13’ షూటింగ్‌లో పాల్గొనేందుకు ప్యాక్ చేసుకున్న లగేజ్ లిస్ట్‌ను అభిమానులతో పంచుకుంది అర్చనా గౌతమ్. ఈ నెలలో దక్షిణాఫ్రికా వేదికగా మొదలయ్యే అడ్వెంచర్ రియాలిటీ షో కంటెస్టెంగ్‌గా వెళ్లనున్న ఆమె.. అక్కడ చలిని తట్టుకోవడానికి అల్లం, వాము, ఎండు మిరపకాయలు, మిక్సర్ గ్రైండర్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాయని వెల్లడించింది. అలాగే లడ్డూలు, స్వీట్లు, బిస్కెట్లు, కాఫీ మేకర్, ఊరగాయ కూడా తీసుకెళ్తున్నానన్న ఆమె.. ఇవన్నీ గ్యాస్ట్రిక్ సమస్యలతోపాటు జలుబు నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఉపయోగపడతాయని, ఈ చిట్కాలన్నీ బామ్మల వంటకం నుంచి నేర్చుకున్నట్లు తెలిపింది. అలాగే ఇదంతా ప్యాక్ చేసుకోవడానికి బలమైన కారణం ఉందన్న నటి.. ‘నేను అంత త్వరగా ఎలిమినేట్ కాలేను. చాలా కాలం పాటు అక్కడే ఉండబోతున్నా’ అంటూ నమ్మకంగా చెప్పింది. జూలైలో ప్రసారం కానున్న యాక్షన్ రియాల్టీ షోకు రోహిత్ శెట్టి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.






