అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ఇక వచ్చేస్తోంది !

by velandi.Saikiran |

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి (anushka shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా

అనుష్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ఇక వచ్చేస్తోంది !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి (anushka shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ... ఇప్పటికీ కూడా యంగ్ హీరోయిన్లకు పోటీని ఇస్తున్నారు. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించారు. అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ప్రాణం పోశారు.

అయితే అలాంటి అనుష్క శెట్టి లేటెస్ట్ గా చేసిన సినిమా ఘాటి ( Ghaati). ఈ మూవీలో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ పూర్తయి... రిలీజ్ కు సిద్ధంగా ఉంది. జులై మాసంలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడ్డ సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో అనుష్క శెట్టి అభిమానులు నిరాశ చెందారు.

మళ్లీ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం... సెప్టెంబర్ మాసంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. సెప్టెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ఓ నిర్ణయానికి వచ్చిందట. కాగా ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి అలాగే సాయిబాబా నిర్మాతలుగా ఉన్న సంగతి తెలిసిందే.

Next Story