- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారర్ థ్రిల్లర్ ‘కిష్కిందపురి’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన అనుపమ.. భయబ్రాంతులకు గురి చేస్తున్న వీడియో
యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఇటీవల ‘డ్రాగన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ఇటీవల ‘డ్రాగన్’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే ఫామ్‌లో వరుస ప్రాజెక్ట్స్ ఒకే చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న చిత్రాల్లో ‘కిష్కిందపురి’(Kishkindapuri) ఒకటి. హారర్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో అనుపమ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) జంటగా నటిస్తున్నారు. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్, అర్చన ప్రజెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి నిర్మిస్తున్నారు.
షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అంచనాలను పెంచుతున్నారు. ఇప్పటికే ఈ ‘కిష్కిందపురి’ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, అనుపమ పరమేశ్వరన్ ‘కిష్కిందపురి’ ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఉండిపోవే నాతోనే పాట ఆగస్టు 7న రాబోతున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో ‘‘సువర్ణ మాయ ప్రసారాలకు స్వాగతం.
‘కిష్కిందపురి’ అనే సినిమాకు సంబంధించిన ప్రచార ప్రకటనలు నేటి నుండి మొదలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ చిత్రం ఇది. ప్రేథ భయానికంటే ముందు ప్రేమను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఒక చక్కటి పాటను విడుదల చేయబోతున్నాం’’ అని దెయ్యం వాయిస్‌తో చెప్పించి అందరినీ భయబ్రాంతులకు గురి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.






