- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్యతో సినిమా.. క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి
టాలీవుడ్ లెజండరీ, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లెజండరీ, నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఆయన యాక్టింగ్‌కు తగ్గట్టు సరైన బొమ్మ పడాలే కానీ, హిట్ కొట్టడం పక్కా. ఎప్పుడూ ఊర మాస్ సినిమాలతో, యాక్షన్ సీక్వెల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న బాలయ్య.. ఈ సారి కామెడీ సినిమాల డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయనున్నారు. ఓపక్క సీరియస్ సింహం.. మరో పక్క కామెడీ కింగ్.. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా రాబోతుందా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే వాటిపై తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అనిల్ రావిపూడి.
తాజాగా ఓ ఇంటర్వ్యాలో పాల్గొన్న అనిల్.. ''బాలయ్యతో సినిమా అంటే అభిమానుల్లో నెక్ట్స్ లెవల్ అంచనాలు ఉంటాయి. ఇదో ప్రత్యేకమైన కాంబినేషన్.. సినిమా కూడా అంతే డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనతో కలిసి చేస్తున్నానని నాకు ఎలాంటి ఒత్తిడి లేదు''.. అంటూ చెప్పుకొచ్చాడు.
Read More......






