Saripodhaa Sanivaaram: విడుదల నేపథ్యంలో ‘సరిపోదా శనివారం’ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్..!

by Kodari Anjali |   (  Updated:2024-08-28 14:34:04  IST  )

నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Saripodhaa Sanivaaram: విడుదల నేపథ్యంలో ‘సరిపోదా శనివారం’ నుంచి   అదిరిపోయే పోస్టర్ రిలీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ విడుదలకు సిద్ధంగా ఉంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ రేపు (ఆగస్టు 29న) థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ మూవీ విడుదల నేపథ్యంలో మూవీ మేకర్స్ వరుస పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నింపుతున్నారు. తాజాగా సరిపోదా శనివారం నుంచి చిత్ర బృందం మరో పోస్టర్ విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో నాని లుక్ అదిరిపోయింది. నాని రగ్గడ్ లుక్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్‌కు ‘స్క్రీన్‌లు ఎప్పటికీ ఒకేలా ఉండవు. రేపటి నుంచి అత్యంత వినోదాన్ని చూడనున్నారు. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి!’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Poster Link : https://x.com/YourTFPA/status/1828723320360976588

Next Story