త్రిషతో అల్లు అర్జున్ రొమాన్స్.. అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు

by Disha Web Desk |
త్రిషతో అల్లు అర్జున్ రొమాన్స్.. అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు
X

దిశ, సినిమా : త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్‌ ఇప్పటికే హ్యాట్రిక్ అందుకుంది. ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురంలో’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఇద్దరు ప్రస్తుతం మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. AA22 పేరుతో ప్రాజెక్ట్ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ కాబోతుండగా.. ఫ్రీడమ్ స్ట్రగుల్ బ్యాగ్రౌండ్‌తో సినిమా తెరకెక్కే అవకాశమున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ పిరియాడిక్ ఫిల్మ్‌లో బన్ని సరసన స్మైలింగ్ క్వీన్ త్రిష నటించనుందని టాక్ వినిపిస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస హిట్స్ అందుకుంటున్న భామకు ఈ మూవీలోనూ మరో ఇంపాక్ట్‌ఫుల్ రోల్ దక్కిందని.. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. అయితే ఈ విషయంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు త్రిషతో అల్లు అర్జున్ రొమాన్స్‌ బాగుంటుందని అంటుంటే.. మరికొందరు యంగ్ బ్యూటీని తీసుకుంటే బెటర్ అని చెప్తున్నారు.

కాగా బన్ని ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 50శాతం చిత్రీకరణ పూర్తి కాగా మరో హాఫ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఇక AA22 గురించి పక్కన పెడితే.. అల్లు అర్జున్ ‘జవాన్’తో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ అట్లీతో కూడా ప్రాజెక్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.

More News : మరోసారి స్టార్ హీరోయిన్స్‌కు గట్టిపోటీ ఇచ్చిన అల్లు అర్జున్ భార్య.. ఎంత క్యూట్‌గా ఉందో


Next Story

Most Viewed