అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ సినిమా విడుదల వాయిదా.. కారణం అదేనా?

by Mallepaka Hamsa |

ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా మారి విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ సినిమా విడుదల వాయిదా.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా మారి విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన మూవీ ‘12A రైల్వే కాలనీ’. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా హిట్ ఫ్లాప్ పట్టించుకోకుండా అల్లరి నరేష్ వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తదుపరి ప్రాజెక్ట్ ‘ఆల్కహాల్’(Alcohol). ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. విడుదల వాయిదా పడినట్లు టాక్.

ఇక ‘12A రైల్వే కాలనీ’ ఫ్లాప్‌ ప్రభావం ఆయన తదుపరి ప్రాజెక్టు ‘ఆల్కహాల్’ మీద పడే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. పలు అప్డేట్స్‌లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ డార్క్ క్రైమ్ థ్రిల్లర్‌కు విడుదల విషయంలో కొత్త సందేహాలు ఎదురవుతున్నాయని టాక్. మెహర్ తేజ్ (Mehar Tej)దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2026 జనవరి 1న విడుదల చేయాలని మూవీ మేకర్స్ ముందుగా ప్రకటించారు. అయితే ‘12A రైల్వే కాలనీ’ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని, ‘ఆల్కహాల్’ కోసం మంచి టైమింగ్ దొరికే వరకు వేచి ఉండాలని మేకర్స్ భావిస్తున్నారట.

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కాగా, ఈ చిత్రంలో రుహాని శర్మ, నిహారిక ఎన్ఎమ్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘ఆల్కహాల్’ రిలీజ్ నిజంగా వాయిదా పడుతుందా లేదా అనేది త్వరలోనే అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలుసుకున్న అల్లరి నరేష్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తన ఆశలన్నీ ‘ఆల్కహాల్’పై పెట్టుకున్న అల్లరి నరేష్‌కు విడుదల విషయంలోవెనకడుగు వేయాల్సి వస్తుంది. ఇక ఇలా వాయిదాలు పడితే సినిమా హిట్ కాదనే సెంటిమెంట్‌ కూడా ఇండస్ట్రీలో ఉంది. అలాంటిది ఈ చిత్రాన్ని వాయిదా వేయడం మంచిది కాదని అభిమానులు సలహా ఇస్తున్నారు.

Next Story