ఒక నాస్తికుడు వల్ల దేవుని స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించాలి.. రాజమౌళి వివాదంపై ఆర్జీవీ సంచలన పోస్ట్

by Mallepaka Hamsa |

దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ సినిమా ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి.

ఒక నాస్తికుడు వల్ల దేవుని స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించాలి.. రాజమౌళి వివాదంపై ఆర్జీవీ సంచలన పోస్ట్
X

దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి ‘వారణాసి’ సినిమా ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. హనుమాన్‌పై చేసిన వ్యాఖ్యలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. దేవుడిని నమ్మను అని చెప్పిన రాజమౌళి దేవుడి సినిమాలు చేస్తుండటంపై విశ్వహిందూ పరిషత్ సీరియస్‌గా తీసుకుంది. చిత్రాలు ఆపేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడంతో రాజమౌళి(Rajamouli)పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ తప్పు అంటూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, ఈ వివాదంపై టాలీవుడ్ నిర్మాత రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ దేవుడి భక్తులం అని చెప్పుకుంటూ, నమ్మిన వాళ్ళు అని పిలవబడే వారు విషం కక్కుతున్న సందర్భంలో రాజమౌళి భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదని వారు తెలుసుకోవాలి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నమ్మకపోవడం అనే హక్కును రక్షిస్తుంది. కాబట్టి విషం కక్కేవారు తాము నమ్ముతామని చెప్తున్నట్లుగా.. తాను నమ్మనని చెప్పే హక్కు రాజమౌళికి ఉందని గ్రహించాలి. ఇప్పుడు దేవుడిని నమ్మకపోతే తన సినిమాల్లో దేవుడిని ఎందుకు చూపిస్తాడు? అనే మూగ వాదనకు వద్దాం. ఒక చిత్రనిర్మాత గ్యాంగ్‌స్టర్ సినిమా తీయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారాలా, భయానక చిత్రం తీయడానికి దెయ్యంగా మారాలా?. అలాగే దేవుడిని నమ్మనంత మాత్రా మూవీస్ చేయకూడదని రూల్ లేదు కదా. సత్యాన్ని గ్రహించకుండా ఆయనను తిట్టే గ్యాంగ్‌స్టర్స్ గురించి మాట్లాడుకుంటే.. అతను దేవుడిని నమ్మకపోయినా, దేవుడు 100 రెట్లు ఎక్కువ విజయం, ఎక్కువ సంపద అభిమానుల ఆరాధనను ఇచ్చాడు. రాజమౌళికి దక్కిన అదృష్టాన్ని చాలా మంది దేవుడిని నమ్మేవాళ్లు వంద జన్మల్లోనూ చేయలేరు.. చూడలేరు. దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇవన్నీ దేవుడు పట్టించుకోడు. నోట్‌ప్యాడ్‌తో కూర్చుని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు అనే దాని గురించి రాయడు కదా.

కాబట్టి నిజమైన సమస్య అతని నాస్తికత్వం కాదు. అసలు సమస్య ఏమిటంటే..రాజమౌళి దేవుడిని నమ్మకుండా విజయం సాధించాడు. పిచ్చివాళ్లలా ప్రార్థించిన తర్వాత కూడా ఘోరంగా విఫలమైన వారిని ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులు దేవుడిని సమర్థించడం మానేయాలి. ఎందుకంటే అది ఆయనను అవమానించడం లాంటిది. నిజం ఏమిటంటే రాజమౌళి నాస్తికుడు కావడం వల్ల దేవుడి స్థాయి తగ్గదని మూర్ఖులంతా గుర్తించండి. విమర్శలు చేసేవారు కాస్త విశ్రాంతి తీసుకోండి. దేవుడు బాగున్నాడు.. రాజమౌళి బాగున్నాడు. వారిద్దరినీ అర్థం చేసుకోలేని వ్యక్తులు మాత్రమే బాధపడుతున్నారు. కాబట్టి ‘వారణాసి’ ద్వారా దేవుడు రాజమౌళికి మరో భారీ అదృష్టాన్ని జోడిస్తాడు. ఇదంతా దేవునిపై నమ్మకంగా ముసుగు వేసుకున్న వారంతా అసూయతో చేస్తున్నదే..జై శ్రీరామ్’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

link

Next Story