ఇలాంటి టైమ్‌లో ప్రియాంక సలహాలు చాలా అవసరం.. అలీ ఫజల్

by Chukka Sudharani |   (  Updated:2023-06-10 10:13:37  IST  )

ఒకేసారి బాలీవుడ్ అండ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేయడంపై అలీ ఫజల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.

ఇలాంటి టైమ్‌లో ప్రియాంక సలహాలు చాలా అవసరం.. అలీ ఫజల్
X

దిశ, సినిమా: ఒకేసారి బాలీవుడ్ అండ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో పనిచేయడంపై అలీ ఫజల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అంతేకాదు ఇలాంటి సమయంలో ప్రియాంక చోప్రా నుంచి సలహాలు తీసుకుంటానంటూ నటిపై ప్రశంసలు కురిపించాడు. ఇటీవలే అమెరికన్ టెలివిజన్ సిరీస్‌తో ఇంగ్లీష్ చిత్రాల్లో అడుగుపెట్టిన ఆయన.. ‘ప్రస్తుతం నా కెరీర్ బిజీ షెడ్యూల్‌తో ముందుకుసాగుతోంది. అయితే ఒకేసారి విభిన్న భాషల్లో నటించడం సంతోషంగా ఉన్నప్పటికీ కాస్త కఠినమైనదే. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రియాంక హెల్స్ తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయంలో ఆమెకు అపారమైన అనుభవం ఉంది. ఇక ప్రస్తుతం నా సగం టైమ్ హాలీవుడ్‌తో గడిపినప్పటికీ మిగిలిన సగం మాత్రం భారతదేశంలోనే గడుపుతాను. ఏదిఏమైనా రెండు పరిశ్రమలతో కలిసి జీవించాలనే నా ప్రయత్నం కొంచెం కష్టంగానే ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: రష్యాలో ఒకేసారి 3వేల థియేటర్లలో విడుదలకానున్న ‘Pathaan’!

Also Read: రౌడీ హీరో విజయ్ సరసన నటించనున్న పూజా హెగ్డే?

Next Story