అతడి వల్లే నా సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి : Akshay Kumar

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-28 17:46:00  IST  )

దిశ, సినిమా: స్టార్ హీరో అక్షయ్ కుమార్ కమెడియన్ కపిల్ శర్మపై ఆసక్తికర ఆరోపణలు చేశాడు. ఆయన నటించిన 'కట్‌పుట్లీ' ఈ నెల 2న విడుదలైన సంగతి తెలిసిందే..Latest Telugu News

అతడి వల్లే నా సినిమాలు ప్లాఫ్ అవుతున్నాయి : Akshay Kumar
X

దిశ, సినిమా: స్టార్ హీరో అక్షయ్ కుమార్ కమెడియన్ కపిల్ శర్మపై ఆసక్తికర ఆరోపణలు చేశాడు. ఆయన నటించిన 'కట్‌పుట్లీ' ఈ నెల 2న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రకుల్‌ ప్రీత్‌తో కలిసి 'కపిల్ శర్మ షో'కు హాజరైన హీరో.. కపిల్ వల్లే తన సినిమాలు సక్సెస్ కాలేకపోతున్నాయంటూ ఫన్నీగా మాట్లాడాడు.

ఇక మీరు ప్రతి పుట్టినరోజున చిన్నపిల్లాడిలా ఎలా మారతారు? అని అక్షయ్‌ను కపిల్ ప్రశ్నిస్తే.. ఇదిగో ఈ వ్యక్తి నేను చేసే ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు. నా సినిమాలు, డబ్బు, యవ్వనం గురించిన రహస్యాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఆయన వల్లే నాకు ఇప్పుడు ఏంలేకుండా పోయింది. నా పరాజయాలకు కారణం అయనే' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. దీంతో షో మొత్తం ఘొల్లుమనగా.. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Also Read : ఆ హీరోకు చిత్తశుద్ధి లేదు : స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

Next Story